: శంషాబాదు ఎయిర్ పోర్టులో బంగారం కలకలం... ఢిల్లీ నుంచి వచ్చిన విమానంలో 9 కిలో బంగారం


అక్రమ మార్గాల్లో తరలివస్తున్న బంగారానికి కేంద్రంగా మారిన హైదరాబాదు, శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి ఉదయం తీవ్ర కలకలం రేగింది. ప్రతినిత్యం ఎంతోకొంత బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్న రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం (డీఆర్ఐ) నేటి ఉదయం ఏకంగా 9 కిలోల బంగారాన్ని పట్టేసుకుంది. ఢిల్లీ నుంచి హైదరాబాదు వచ్చిన విమానంలోని ఓ సీటు కింద సదరు బంగారం కలిగిన బ్యాగును డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని అధికారులు గుర్తిస్తారనే భయంతోనే దానిని తీసుకువచ్చిన ప్రయాణికుడు విమానంలోనే వదిలివెళ్లి ఉంటాడని డీఆర్ఐ భావిస్తోంది. సదరు బ్యాగును విమానంలోకి తీసుకువచ్చిన ప్రయాణికుడు ఎవరన్న అంశాన్ని నిగ్గుతేల్చేందుకు డీఆర్ఐ విచారణ చేప్టటింది.

  • Loading...

More Telugu News