: ‘అనంత’ రోడ్డు ప్రమాదంలో కర్నూలు వాసుల మృతి... సోమందేపల్లి వద్ద కారు బోల్తా


అనంతపురం జిల్లాలో నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని సోమందేపల్లి మండల పరిధిలోని హైదారాబాదు-బెంగళూరు జాతీయ రహదారిపై ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్న వారిని కర్నూలువాసులుగా గుర్తించారు. తీర్థయాత్రల్లో భాగంగా రామేశ్వరం నుంచి కర్నూలు బయలుదేరిన వీరు ప్రమాదం బారినపడ్డారని పోలీసులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని పెనుగొండ ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News