: మరో ఫారెన్ ట్రిప్ కు తరలివెళ్లిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మరో విదేశీ యాత్రకు తరలివెళ్లారు. సీషెల్స్, మారిషస్, శ్రీలంక దేశాల్లో ఆయన పర్యటన సాగనుంది. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. ఈ నెల 15న భారత్ తిరిగి వస్తారు. పయనమయ్యే ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ఆయా దేశాలతో మైత్రిని మరింత బలోపేతం చేసుకునే దిశగా తన పర్యటన సాగుతుందని అన్నారు. హిందూ మహాసముద్ర తీరప్రాంత దేశాలతో చెలిమికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. పొరుగు దేశాలకు భద్రత పరంగా సహకారం అందిస్తామని చెప్పారు.