: భూసేకరణ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్
భూసేకరణ సవరణ బిల్లుపై లోక్ సభలో ఓటింగ్ జరుగుతోంది. లోక్ సభలో నేటి మధ్యాహ్నం నుంచి ఈ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లుకు కేంద్రం 11 సవరణలు ప్రతిపాదించింది. చర్చ సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు విపక్షాలు, మిత్ర పక్షాల మద్దతు కోరారు. భూసేకరణ సవరణ బిల్లుకు శివసేన, అకాలీదళ్, టీడీపీ, బీజేడీ మద్దతిస్తుండగా... కాంగ్రెస్, వామపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వాటికి ఇతర ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయి. ఓటింగ్ సందర్భంగా బీజేపీ ఎంపీలంతా విధిగా పాల్గొనాలని ఆ పార్టీ విప్ జారీ చేసింది. ప్రతిపక్షాలు సూచించిన సవరణలను స్పీకర్ తోసిపుచ్చారు.