: చంద్రబాబు విద్యుత్ తీసుకోమన్నా తీసుకోం: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ ను 1500 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు చంద్రబాబు విద్యుత్ ఇస్తామన్నా తీసుకోమని అన్నారు. చంద్రబాబు విద్యుత్ ఇవ్వకపోవడం వల్ల తమకు మంచే జరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. చంద్రబాబుతో పాటు, ఏపీ ఉద్యోగులను కూడా ఇక్కడ మంచిగా చూసుకోవాలని అధికారులకు చెప్పానని కేసీఆర్ తెలిపారు. వాళ్లు తమకు టూరిస్టుల్లాంటి వాళ్లని అన్నారు. వాళ్లు తమకు ట్యాక్సులు కడతారని ఆయన చెప్పారు. చంద్రబాబు కక్షగట్టకుంటే విద్యుత్ కొనుగోలు చేసేవాళ్లం కాదేమో అన్నారు. ఏదేమైనా బాబు వల్ల మంచే జరిగిందని ఆయన పేర్కొన్నారు.