: బ్రాండింగ్ లో నంబర్ వన్ గా కత్రినా
బాలీవుడ్ అందాల భామ కత్రినా కైఫ్ తన ముఖారవిందంతో భారీ సంఖ్యలో బ్రాండ్లను ఎండార్స్ చేస్తోంది. ఏ బ్రాండుకైనా మొదటి చాయిస్ గా కత్రినానే కనిపిస్తోందని యాన్యువల్ బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్-2015 వెల్లడిస్తోంది. మిగతా కథానాయకులు, నాయికల కంటే ఆమే కావాలని పలు సంస్థలు పోటీ పడుతున్నాయట. ప్రకటనల విషయంలో తన అందం, పర్సనాలిటీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని, అంతేగాక, అత్యంత ఫోటోజెనిక్ గా ఉండటంతో కేట్ కోసమే పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని సమాచారం. వాణిజ్య ప్రకటనల రంగానికి సంబంధించినంత వరకు ప్రస్తుతం అత్యంత నమ్మకమైన ప్రచారకర్తల్లో అమ్మడు కూడా ఉందని సర్వే చెబుతోంది.