: స్వాతంత్ర్యం కావాలి... చైనా ఎంబసీ వద్ద టిబెటన్ల ఆందోళన


ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయం ఎదుట వందలాది మంది టిబెటన్ శరణార్థులు ఆందోళన చేపట్టారు. స్వేచ్ఛా టిబెట్ కావాలంటూ నినాదాలు చేశారు. పోస్టర్లు, బ్యానర్లు, పతాకాలు చేతపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. టిబెట్ తిరుగుబాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఆందోళన చేపట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కొందరు నల్లటి ముసుగులు ధరించగా, మరికొందరు టిబెట్ పతాకాన్ని చిత్రించుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని, అక్కడ నుంచి తరలించారు.

  • Loading...

More Telugu News