: మలేషియా విమాన ఘటనలో క్లూ... వేలమైళ్ళు ప్రయాణం చేసి ఆస్ట్రేలియా తీరానికి చేరిన చిన్న ప్యాకెట్


మలేషియా ఎయిర్ లైన్స్ కు చెందిన ఎంహెచ్ 370 విమానం మాయమై ఒక సంవత్సరం గడిచిన తర్వాత చిన్న క్లూ ఒకటి దొరికింది. ఈ ఉదయం ఆస్ట్రేలియా తీరానికి ఓ చిన్న ప్యాకెట్ కొట్టుకు వచ్చింది. ఇక్కడి సెర్ వాంటెస్ బీచ్ విహారానికి వచ్చిన కింగ్ స్లే, విక్కీ మిల్లర్ దంపతులకు ఈ ప్యాకెట్ దొరికింది. దీని మీద మలేషియా ఎయిర్లైన్స్ లోగో స్పష్టంగా ఉండడంతో, దీన్ని పోలీసులకు అప్పగించామని వారు తెలిపారు. వేల మైళ్ళు ప్రయాణం చేసి ఒడ్డుకు కొట్టుకొచ్చిన ఒక చిన్న కర్చీఫ్ లాంటి ఈ ప్యాకెట్ విమానం కోసం వెతుకుతున్న అధికారులలో కోటి ఆశలు రేపుతోంది. ఆ ప్యాకెట్ మాయమైన మలేషియా ఎయిర్ లైన్స్ విమానానికి సంబంధించినది అయి ఉండవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News