: స్పెషల్ స్టేటస్ అనేది బిల్లులోనే లేదు: చంద్రబాబు
రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. స్సెషల్ స్టేటస్ అనేది బిల్లులోనే లేదని స్పష్టం చేశారు. రైల్వే జోన్, రాజధానికి నిధులు, రెవెన్యూ లోటు భర్తీకి హామీ ఇచ్చిందని చెప్పారు. ప్రణాళిక సంఘం ఏపీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదనే చెప్పానని అన్నారు. శాసనసభలో మాట్లాడుతూ, ఆయన ఈ వివరాలను వెల్లడించారు. దేశ, రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడతానని చెప్పారు. అధికారంలోకి రాకముందే స్వప్రయోజనాల కోసం జగన్ చానల్, పేపర్ పెట్టుకున్నారని విమర్శించారు. గత 30 ఏళ్లుగా నీతి, నిజాయతీతో రాజకీయాల్లో కొనసాగుతున్నానని చెప్పారు. తప్పుడు పనులు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోనని ఘాటుగా హెచ్చరించారు.