: చంద్రబాబు ఓ మహిళా ద్రోహి: రోజా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైకాపా ఎమ్మెల్యే, సినీనటి రోజా విమర్శలు గుప్పించారు. ఆయన ఓ మహిళా ద్రోహి అంటూ విమర్శించారు. రాష్ట్రంలో మహిళా వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చి మరీ సమావేశాలకు తీసుకువచ్చే చంద్రబాబు... ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారిని మర్చిపోయారని అన్నారు. 'ఏరు దాటక ముందు ఏటి మల్లన్న... ఏరు దాటాక ఓటి మల్లన్న' అన్న రీతితో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డ్వాక్రా రుణ మాఫీ అంశంపై సభలో చర్చించే ధైర్యం టీడీపీకి లేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆమో ఈ వ్యాఖ్యాలు చేశారు.