: గుర్తింపు సరే... మా గోడు వినేదెవరు?: ఒంటిమిట్ట వాసుల ఆవేదన


ఒంటిమిట్ట... నిన్నమొన్నటి వరకూ పెద్దగా ప్రాచుర్యం లేని ఓ చిన్న గ్రామం. కడప జిల్లాలో ఉన్న ఈ గ్రామంలోని ప్రాచీన కోదండ రామాలయం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రాష్ట్రం విడిపోయిన తరువాత అధికారిక శ్రీరామ కల్యాణం ఒంటిమిట్టలో జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట వాసులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. పచ్చగా ఉన్న పల్లె వాతావరణం పట్టణ శోభ సంతరించుకుంది. ఆలయ అభివృద్ధి పేరుతో సంవత్సరాల తరబడి నివాసం ఉంటున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే పని పెట్టుకుంది ప్రభుత్వం. తమకు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఖాళీ ఎలా చేయిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామానికి గుర్తింపు మాటెలా ఉన్నా మా గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఈ ఉదయం ఇళ్ళు కూల్చేందుకు అధికారులు రాగా, గ్రామస్తులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

  • Loading...

More Telugu News