: కోహ్లీ ప్రదర్శన, పరధ్యానానికి నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదు: అనుష్క శర్మ
ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శన విషయంలో ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో ప్రేమాయణమే కారణమంటూ తీవ్ర పుకార్లు వచ్చిన సంగతి విదితమే. తాజాగా వాటిపై అనుష్క ఓ ఆంగ్ల ఛానల్ లో తీవ్రంగా స్పందించింది. "కోహ్లీ వైఫల్యానికి నేనే కారణమనడం సరికాదు. తొందరపాటు చర్య. మైదానంలో ఆటపై తన ఏకాగ్రత, ప్రదర్శన విషయాల్లో నన్ను నిందించడం సరికాదు. నా వృత్తి జీవితంలో విరాట్ ప్రభావం లేదు. అదే సమయంలో నా ప్రభావం కూడా అతనిపై లేదు. అసలు విరాట్ సామర్థ్యంపై ఎందుకు అనుమానపడుతున్నారు? అతను సాధించిన దాన్ని క్రెడిట్ గా గుర్తించండి" అని అనుష్క పేర్కొంది.