: జానారెడ్డి మాటలతో ఏకీభవిస్తున్నా!: కేసీఆర్
శాసనసభలో ఉన్న ప్రతి ఒక్కరూ సభ మర్యాదను కాపాడాలన్న కాంగ్రెస్ నేత జానారెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం సరికాదని చెప్పారు. సభా సమావేశాలను ప్రజలంతా గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సభ్యులకు సూచించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నానని కేసీఆర్ చెప్పారు. శాసనసభను నడుపుకోవడం రావడం లేదు అని ఇతరులు కామెంట్ చేయకుండా ఉండేందుకు... తెలంగాణ పరువు పోకుండా కాపాడుకుందామని సభ్యులను కోరారు. మంత్రులు కూడా సంయమనంతో ఉండాలని అన్నారు. మంత్రి జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నానన్నారు.