: టీడీపీ తీరు సరికాదు... ఇదేనా మిత్ర ధర్మం?: బీజేపీ మండిపాటు


కేంద్ర బడ్జెట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని అసెంబ్లీలో ఆరోపణలు వస్తే, వాటిని గట్టిగా ప్రతిఘటించాలని బీజేపీ ఎంఎల్ఏలు నిర్ణయించారు. కేంద్రంలో తమ పార్టీతో మిత్రత్వాన్ని నడుపుతూ, ఇక్కడ మాత్రం శత్రువుల్లా చూస్తున్నారని ఆ పార్టీ నేతలు వాపోయారు. మిత్ర ధర్మాన్ని వారు విస్మరించారని దుయ్యబట్టారు. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంఎల్ఏలు సమావేశమై తెలుగుదేశం పార్టీ నేతల తీరును తప్పుబట్టారు. బీజేపీ గురించిగానీ, తమ నేత మోదీ గురించిగానీ ప్రస్తావన వస్తే సమర్థవంతంగా ఎదుర్కోవాలని వారు నిశ్చయించారు.

  • Loading...

More Telugu News