: ఇదో కౌరవ సభ... విరుచుకుపడ్డ జగన్
ఎంతో ముఖ్యమైన అంశాలపై చర్చ వద్దంటూ, ప్రజా సమస్యలను చర్చకు రానీయకుండా అధికార టీడీపీ అడ్డుకుంటోందని వైకాపా చీఫ్, విపక్ష నేత వై.ఎస్. జగన్ దుయ్యబట్టారు. తాము చర్చకు ఇచ్చిన అంశాలు ఎంత ముఖ్యమైనవో చెప్పేందుకు కనీసం 5 నిమిషాల సమయం కూడా ఇవ్వరా? అని ఆయన ప్రశ్నించారు. ఈ అసెంబ్లీ కౌరవ సభను తలపిస్తోందని విమర్శించారు. డ్వాక్రా మహిళల సమస్యలను జగన్ ప్రస్తావించబోతే స్పీకర్ కోడెల ఆయన మైక్ ను కట్ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.