: పరకాల ఎంఎల్ఏ కారుకు యాక్సిడెంట్


వరంగల్ జిల్లా పరకాల ఎంఎల్ఏ చల్లా ధర్మారెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి హైదరాబాద్ -వరంగల్ జాతీయ రహదారిపై జనగామ శివారులో ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఇండికాను ఢీ కొట్టింది. కారులో ఆయనతో పాటు భార్య జ్యోతి, కూతుళ్లు మానస, జాహ్నవి, మూడు నెలల మనవరాలుతో ఉండగా, అందరికీ గాయాలయ్యాయి. జాహ్నవి తలకు బలమైన గాయమైంది. ఇదే సమయంలో ఇండికాలో ప్రయాణిస్తున్న వర్ధన్నపేట మండలం రాపర్తి నివాసి కుమార్ ,ఆయన భార్య వెంకటలక్ష్మి, పిల్లలు హరీష్, అభిలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చల్లా కుటుంబాన్ని భువనగిరి నుంచి అంబులెన్స్‌ లో హైదరాబాదుకు పంపించారు.

  • Loading...

More Telugu News