: భారత బౌన్సర్లను బౌండరీలకు తరలిస్తున్న ఐర్లాండ్ ఓపెనర్లు... 7 ఓవర్లలో 47/0


ఐర్లాండ్ ఓపెనర్లు భారత బౌలింగును దీటుగా ఎదుర్కొంటున్నారు. తొలి ఓవర్ లో ఫోర్ తో ఫామ్ ను కొనసాగించిన ఐర్లాండ్ కెప్టెన్, ఓపెనర్ ఫోర్టర్ ఫీల్డ్ (26) మూడో ఓవర్ లోనే సిక్స్ ల ఖాతా తెరిచాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ ను అతడు సమర్థంగా ఎదుర్కొన్నాడు. దీంతో ఉమేశ్ యాదవ్ ను బౌలింగ్ నుంచి తప్పించిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, అతడి స్థానంలో మోహిత్ శర్మను రంగంలోకి దించాడు. మోహిత్ బౌలింగ్ నుంచి కూడా ఫోర్టర్ ఫీల్డ్ పరుగులు రాబడుతున్నాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వేసిన మోహిత్ బౌలింగులో ఫోర్టర్ ఫీల్డ్ మరో ఫోర్ కొట్టాడు. ఇక మరో ఎండ్ లో బ్యాటింగ్ కు వచ్చిన ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (16) కూడా రాణిస్తున్నాడు. ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్లేమీ నష్టపోకుండానే ఐర్లాండ్ 47 పరుగులు చేసింది.

  • Loading...

More Telugu News