: సీమకు ఎక్కడ సాగు నీళ్ళొచ్చేస్తాయోనని... జగన్ బెంబేలెత్తిపోతున్నారు: ఏపీ సీఎం చంద్రబాబు


రాయలసీమకు ఎక్కడ సాగు నీరొస్తుందోనని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంబేలెత్తిపోతున్నారని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిన్న హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన జగన్ పై విరుచుకుపడ్డారు. రాయలసీమకు నీరొస్తే, అందరికీ ఉపాధి దొరుకుతుందని, దీంతో తమ ఫ్యాక్షనిజానికి చెక్ పడిపోతుందని జగన్ భయపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే జగన్ పార్టీ అసెంబ్లీలో అనవసరంగా రచ్చకు దిగడం ద్వారా ప్రజా సంక్షేమంపై చర్చకు అవకాశం లేకుండా చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్న తమ ప్రభుత్వాన్ని అడ్డుకోలేరని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News