: భూసేకరణ బిల్లుపై తొందరపడి మాట్లాడం: జితేందర్ రెడ్డి
భూసేకరణ బిల్లుపై తొందరపడి ఇప్పుడే మాట్లాడబోమని టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, భూసేకరణ బిల్లులో పూర్తిగా మార్పులు జరిగిన తరువాతే స్పందిస్తామని అన్నారు. పేదలు, రైతులకు అన్యాయం జరిగేలా బిల్లు ఉంటే దానిని తప్పకుండా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ పేదలు, రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని ఆయన చెప్పారు. బిల్లు సభ ముందుకు వచ్చిన తరువాత అధికారపక్షంతో నడవాలో, లేక, ప్రతిపక్షంతో నడవాలో నిర్ణయించుకుంటామని తెలిపారు. కాగా, అధికార పక్షం భూసేకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటామని చెబుతుండగా, భూసేకరణ బిల్లు ఎలా పాస్ అవుతుందో చూస్తామంటూ ప్రతిపక్షాలు సవాలు విసురుతున్న సంగతి తెలిసిందే.