: దొంగనుకొని అస్సాం విద్యార్థిని చితగ్గొట్టిన ఢిల్లీ వాసులు


తాగిన మత్తులో తన గది అనుకొని పక్కింటి తలుపులు తెరవాలని ప్రయత్నించిన అస్సాం విద్యార్థిని చుట్టుపక్కల వాళ్లు చితగ్గొట్టారు. ఈ ఘటన దక్షిణ ఢిల్లీలోని ఓ కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గౌహతీకి చెందిన అర్బాజ్ అహ్మద్ (21) తెల్లవారుజామున ఇంటికి వచ్చాడు. తన ఇల్లు అనుకొని పక్కింటి తలుపు తాళం తీయాలని చూశాడు. తాళం తెరుచుకోకపోవడంతో పగలగొట్టాలని చూశాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్లు అహ్మద్ ను పట్టుకొని కొట్టారు. ఈ ఘటనలో అతని కాలు, భుజం, ఇంకా పలు చోట్ల ఎముకలు విరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించి విచారణ జరిపారు. బాధితుడి గుర్తింపు కార్డు పరిశీలించిన అనంతరం అతను కూడా అదే కాలనీకి చెందినవాడని, తలుపులు ఒకేలా ఉండటం, రూంలు ఒకే ఫ్లోర్ లో ఉండటంతో పొరపాటున వెళ్లినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఐఏఎస్ లక్ష్యంతో చదువుతున్న అహ్మద్ గత రెండేళ్లుగా అదే ప్రాంతంలో ఉంటున్నాడని వివరించారు.

  • Loading...

More Telugu News