: ఆ అధికారం మీకెక్కడిది?... పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు


వరంగల్ యాసిడ్‌ దాడి నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీసుల తీరుపై ఈ ఉదయం హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పట్లో నిందితులను పోలీసులు పదేపదే మీడియాకు చూపించడాన్ని తప్పుబట్టింది. హీరోయిజం ప్రదర్శిస్తున్నారా? అని ప్రశ్నించిన కోర్టు, ఉత్తర్వులు లేకుండా నిందితులను మీడియాకు చూపడం ఏమిటని అడిగింది. ఇందుకు ఏ చట్టం అనుమతిస్తోందని, ఈ తరహా వైఖరి మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఎన్‌కౌంటర్ విషయంలో కేసు నమోదు చేశారా? లేదా? అని న్యాయమూర్తి ఆరా తీశారు. 2008లో స్వప్నిక, ప్రణీత అనే విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగిన సంగతి, అనంతరం నిందితులు పోలీస్ ఎన్ కౌంటర్ లో మరణించిన సంగతి విదితమే.

  • Loading...

More Telugu News