: సోనియాను కలిసిన ‘నవ్యాంధ్ర’ రైతులు... బలవంతంగా భూములు లాక్కున్నారని ఫిర్యాదు


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారం ఢిల్లీ గడప తొక్కింది. రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు సర్కారు తమ భూములను లాక్కుందని ఆరోపిస్తున్న రైతులు నేటి ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. రాజధాని నిర్మాణం కోసం తమ భూములనివ్వబోమని తేల్చిచెప్పినా ప్రభుత్వం తమను భయపెట్టి భూములు లాక్కుందని వారు ఆమెకు ఫిర్యాదు చేశారు. రైతుల ఆవేదనను ఓపికగా విన్న సోనియా గాంధీ, ఈ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News