: రాజస్థాన్ క్రికెట్ అధ్యక్ష పదవి నుంచి లలిత్ మోదీకి ఉద్వాసన
రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ (ఆర్ సీఏ) అధ్యక్షుడు లలిత్ మోదీకి ఉద్వాసన పలికింది. ఈరోజు ప్రత్యేకంగా సమావేశమైన అసోసియేషన్ సభ్యులు లలిత్ మోదీని అభిశంసిస్తున్నట్టు తెలిపారు. ఆయన బర్తరఫ్ పై ఓటింగ్ జరుగగా 18 మంది పాల్గొన్నారు. వీరిలో 17 మంది ఆయన ఉద్వాసనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆర్ సీఏ సమావేశంలో తీవ్ర గందరగోళం జరిగినట్టు తెలుస్తోంది. అసోసియేషన్ హాల్ బయట లలిత్ మోదీ మద్దతుదారులపై రాళ్ల దాడి జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.