: చంద్రబాబుకు జగన్ ఛాలెంజ్... ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన పార్టీ టీడీపీపై వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు, టీడీపీకి ఛాలెంజ్ విసిరారు. బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని భావిస్తే, నరేంద్ర మోదీ సర్కారు నుంచి బయటకు రావాలని సవాల్ చేశారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ప్రకటించిన సీఎం చంద్రబాబు మోదీ ప్రభుత్వంలో ఎందుకు కొనసాగుతున్నారని జగన్ నిలదీశారు. దీంతో, సభలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ కోడెల మంగళవారానికి వాయిదా వేశారు.