: తప్పు చేస్తే క్షమాపణ చెబుతాం: హరీశ్ రావు
అసెంబ్లీలో జాతీయ గీతం వినిపిస్తున్నవేళ తమ సభ్యులు తప్పు చేసిన పక్షంలో క్షమాపణ చెప్పేందుకు టీఆర్ఎస్ వెనుకంజ వేయబోదని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ, జాతీయ గీతాన్ని ఆలపించిన సమయంలో అధికారపక్ష సభ్యులు కూడా నినాదాలు చేశారని తెలిపారు. తప్పు ఒప్పుకొని సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జానారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, సభలో టీఆర్ఎస్ ఎంఎల్ఏలు రచ్చ చేస్తే క్షమాపణ చెబుతామని హరీశ్ వివరించారు. ఫ్లోర్ లీడర్లు సమావేశమై ఆ ఫుటేజ్ లను పరిశీలించాలని సూచించారు. వాటిని చూస్తే ఎవరు తప్పు చేశారన్న విషయం తెలుస్తుందన్నారు.