: నేడు చంద్రబాబు జన్మదినం.. వేడుకలకు దూరం
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నేడు 64 సంవత్సరంలోకి అడుగుపెట్టారు. అయితే, తాను జన్మదిన వేడుకలను జరుపుకోవడంలేదని ఆయన తెలిపారు. ఢిల్లీలో ఐదేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటనకు నిరసనగానే తన పుట్టినరోజును నిర్వహించుకోవడంలేదని చెబుతూ, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని కార్యకర్తలకు బాబు సూచించారు మరోవైపు ఆయన చేస్తున్న పాదయాత్ర నేటితో 200వ రోజుకు చేరింది. ప్రస్తుతం యాత్ర విశాఖలో కొనసాగుతోంది.