: బెంచీలెక్కిన సభ్యులు క్షమాపణ చెప్పాల్సిందే... లేకుంటే చర్యలు తీసుకోండి: హరీశ్
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా జాతీయ గీతాన్ని అవమానపరిచేలా బెంచీలెక్కి నిరసన తెలిపిన టీ టీడీపీ సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన స్పీకర్ ను కోరారు. ఈ సందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు హరీశ్ రావు ప్రసంగానికి అడ్డుతగిలారు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది. సభా సంప్రదాయాలను మంటగలిపేలా వ్యవహరించిన సభ్యులు క్షమాపణ చెప్పకపోతే చర్యలు తీసుకోవాలని ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ప్రభుత్వం ప్రతిపాదించింది.