: మాట్లాడకముందే ప్రశ్నలు సమంజసం కాదు... మీడియాపై రేవంత్ రెడ్డి ఆగ్రహం
టీడీఎల్పీ ఉపనేత రేవంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కొద్దిసేపటి క్రితం మీడియా వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు నేడు ఇందిరా పార్కు వద్ద చేపట్టనున్న దీక్షకు సంబంధించి మీడియాతో మాట్లాడేందుకు వచ్చిన రేవంత్ రెడ్డిపై మీడియా ప్రశ్నల వర్షం కురిపించింది. దీంతో ఒక్కసారిగా మీడియాపై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి, విషయంపై తాము మాట్లాడకముందే ప్రశ్నలు సంధించడం సబబు కాదని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రతినిధులుగా తొలుత తమ విధులను నిర్వర్తించే అవకాశం కల్పించాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తాము మాట్లాడిన తర్వాత ప్రశ్నలు వేయాలని సూచించారు.