: వేరే పార్టీకి ఓటేస్తే పక్క రాష్ట్రానికి ఓటేసినట్టే: హరీశ్ రావు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం ఊపందుకుంది. మంత్రి హరీశ్ రావు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ జిల్లా తొర్రూరులో పర్యటించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాజేశ్వర్ రెడ్డి కోసం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కాకుండా వేరే పార్టీకి ఓటేస్తే పొరుగు రాష్ట్రానికి ఓటేసినట్టేనని సూత్రీకరించారు. టీఆర్ఎస్ ఇంటి పార్టీ వంటిదని, దానికే ఓటేయాలని పిలుపునిచ్చారు. 'ఇంటి పార్టీకి ఓటేద్దాం, పక్క పార్టీ వాళ్లను తరిమికొడదాం' అని పేర్కొన్నారు.