: రౌండ్ టేబుల్ సమావేశానికి పవన్ కల్యాణ్ ను ఆహ్వానించనున్న 'లోక్ సత్తా' జేపీ


లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ఈ నెల 15న హైదరాబాదులో ఉభయ రాష్ట్రాల రాజకీయ పక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా ఆహ్వానిస్తామని జేపీ తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాల పరిస్థితిలో మార్పు కోసం పోరాడతామని జేపీ స్పష్టం చేశారు. అందుకోసం అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. పవన్ కల్యాణ్ కొన్ని రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రాజధాని భూసేకరణ అంశంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవద్దని, రైతుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని అన్నారు. ఈ వ్యాఖ్యలను జేపీ సమర్థించారు.

  • Loading...

More Telugu News