: ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకోనున్న నటుడు జగపతిబాబు కుమార్తె... నేడు వెస్టిన్ హోటల్ లో వివాహం


ప్రముఖ నటుడు జగపతిబాబు కుమార్తె వివాహం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. ఆయన కుమార్తె మేఘన అమెరికాలో ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేసి అక్కడ సెటిల్ అయి, ఒక ఎన్నారైను ప్రేమించింది. వీరి వివాహానికి జగపతిబాబు సైతం ఓకే చెప్పారు. ఇద్దరికీ ఈరోజు హైదరాబాదులోని వెస్టిన్ హోటల్ లో వివాహానికి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు పలువురు నటులు, రాజకీయ నేతలు హాజరుకానున్నారు. గురువారం జరిగిన సంగీత్ ఉత్సవంలో పలువురు హీరోయిన్లు, జగపతిబాబు స్నేహితుడు, హీరో అర్జున్ హాజరై సందడి చేసినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News