: పరుగులు వెల్లువెత్తించిన ఆస్ట్రేలియా!... లంక లక్ష్యం 377 పరుగులు


రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరుగుతున్న పోరులో మరో భారీ స్కోరు నమోదైంది. సిడ్నీలో శ్రీలంకతో ఆడుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 376 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక వైపు వాట్సన్, మరోవైపు మాక్స్ వెల్ పరుగుల వరద పారించారు. బౌలింగ్ ప్రధాన బలంగా ఉన్న లంక జట్టు ఆస్ట్రేలియా ప్లేయర్ల ధాటికి నిలవలేకపోయింది. ఓపెనర్ వార్నర్ 9 పరుగులకే అవుట్ అయినప్పటికీ, మాక్స్ వెల్ సెంచరీకి తోడు స్మిత్, క్లార్క్, వాట్సన్ అర్ధ సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. కేవలం 53 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్ ల సాయంతో మాక్స్ 102 పరుగులు సాధించాడు. చివర్లో హడిన్ 9 బంతుల్లో 25 పరుగులు పిండుకున్నాడు. మరికాసేపట్లో 377 పరుగుల లక్ష్యంతో లంక జట్టు చేజింగ్ మొదలుపెట్టనుంది.

  • Loading...

More Telugu News