: హాల్ టికెట్లు ఇవ్వకుండా కాలేజీలు ఏడిపిస్తే... డౌన్ లోడ్ చేసుకోండి!
ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే, వాటిని వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య ఇంటర్ విద్యార్థులకు సూచించారు. bie.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరు కావాలని ఆయన అన్నారు. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో, ఫీజులు చెల్లించలేకపోయిన వారికి హాల్ టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళనకు గురి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యర్ కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు.