: భూసేకరణ అభినందనీయం!: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం స్థానికులను ఒత్తిడి చేయకుండా సరికొత్త విధానాలతో భూసేకరణ చేయడం అభినందనీయమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాదులో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, చారిత్రాత్మక రీతిన చంద్రబాబునాయుడు రైతులను కష్టపెట్టకుండా భూసేకరణ చేయడం అద్భుతమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణపై అర్థం పర్ధం లేని ఆరోపణలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ ప్రతిపాదనలు కేంద్రానికి అందిన వెంటనే అన్ని మంత్రిత్వ శాఖలు సాయం చేస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్రాలన్నీ కలిసి పనిచేయాలని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని చెప్పిన ఆయన, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News