: ఐఎస్ కు ఎదురుదెబ్బ... చేజారిన అల్-బగ్దాదీ పట్టణం
ఇరాక్, సిరియాల్లో నరమేధం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరాక్ లో అత్యంత కీలకమైన పట్టణాల్లో ఒకటైన అల్-బగ్దాదీ చాలా కాలంగా ఐఎస్ఐఎస్ అధీనంలో ఉంది. ఈ పట్టణాన్ని ఐఎస్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఇరాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అమెరికా ఆధ్వర్యంలో జరుగుతున్న దాడుల్లో ఐఎస్ వర్గాలు తోకముడిచాయని వెల్లడించాయి. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి బగ్దాదీ పట్టణంపై అమెరికా 26 వైమానిక దాడులు చేసింది. త్వరలోనే ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు కొనసాగిస్తామని ఇరాక్ ప్రభుత్వం తెలిపింది.