: వారం తరువాత తెరిచిన రహదారులు
జమ్మూకాశ్మీర్ లో ఐదు రోజుల విరామం తరువాత జాతీయ రహదారిపై వాహన రాకపోకలను ప్రారంభించారు. గత వారం రోజులుగా జమ్మూకాశ్మీర్ లో కురుస్తున్న భారీ హిమపాతం, వరదలు, కొండ చరియలు విరిగిపడడం కారణంగా జాతీయ రహదారిని మూసివేశారు. దీంతో ఐదు రోజులుగా ఆ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా పేరుకుపోయిన మంచును తొలగించిన సిబ్బంది, ఒకవైపు రాకపోకలకు రోడ్డును సిద్ధం చేశారు.