: విశాఖను కుదిపేసిన గ్యాంగ్ రేప్ నిందితులు దొరికారు
హైదరాబాదుకు చెందిన యువతిని కిడ్నాప్ చేసి కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో యువతిని రోడ్డుపై వదిలేసి వెళ్లిపోతుండగా, స్థానికులు ఒకడిని పట్టుకుని పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి రాంనగర్ కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, యువతిని కిడ్నాప్ చేసి కారులో అత్యాచారం చేేసినట్టు నిర్ధారణ అయింది. దీంతో వారిని రిమాండ్ కు తరలించారు. సామూహిక అత్యాచారంపై విశాఖవాసులు మండిపడుతున్నారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.