: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారన్న నమ్మకం లేదు: జేసీ


ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం తనకు లేదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. తాను రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా ఇస్తారంటే, తప్పకుండా చేస్తానని తెలిపారు. చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజాప్రతినిధులు ఆందోళన చేయాలని పవన్ కల్యాణ్ అన్నారని... ఎలాంటి ఆందోళన చేయాలో ఆయనే చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనను బాగా చూసుకుంటున్నారని జేసీ తెలిపారు. సంక్రాంతి సందర్భంగా 'చంద్రన్న సంక్రాంతి కానుక' పేరుతో రూ. 350 కోట్లు అనవసరంగా ఖర్చు చేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News