: ఆంధ్రా నేతల మోచేతి నీరు తాగే కుసంస్కారులు... టీడీపీ నేతలపై కేటీఆర్ ఫైర్


తెలంగాణలోని తెలుగుదేశం పార్టీ నేతలు ఆంధ్రాకు చెందిన నాయకుల మోచేతి నీరు తాగే కుసంస్కారులని మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. అసెంబ్లీ వాయిదాపడ్డ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. నేడు సభలో టీడీపీ నేతల తీరు అత్యంత హేయమని విమర్శించారు. గవర్నర్ ప్రసంగానికి దేశం సభ్యులు అడ్డు తగులుతుంటే, తాము అడ్డుగా నిలిచామని స్పష్టం చేశారు. గతంలో వైఎస్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు, బీజేపీ సైతం ఇతర పార్టీ నేతలను చేర్చుకున్నారని గుర్తుచేసిన ఆయన, అప్పుడు నైతికత గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. తెలుగుదేశం సభ్యులు సభలో అశాంతి, గందరగోళానికి కారణమవుతుంటే, తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News