: రేపిస్ట్ హత్యతో నాగాలాండ్ లో ఉద్రిక్తత... పోలీసుల కాల్పుల్లో ఒకరి మృతి


అత్యాచారానికి పాల్పడ్డ రేపిస్ట్ ను జైల్లో నుంచి బయటకు లాగి హత్య చేసిన నాగాలాండ్ వాసులు దోషులకు గట్టి హెచ్చరికలే చేశారు. అయితే ఆ ఘటన రాష్ట్రంలో పెను అలజడిని రేపింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న ప్రజలు నిందితుడిని చంపడమేంటని రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటన జరిగిన దీమాపూర్ లో నిన్న కర్ఫ్యూ విధించింది. ఈ క్రమంలో జరిగిన ప్రజల ఆందోళన, పోలీసుల కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోయాడు. అయితే, చెదురుమదురు ఘటనలు మినహా దీమాపూర్ లో పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, నిందితుడి తరఫు వారు ప్రతీకార దాడులు చేస్తారేమోనన్న భయాందోళనలు అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News