: అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో అబద్ధాలు చెప్పిస్తారా?... వైకాపా విమర్శలు
నేటి గవర్నర్ నరసింహన్ ప్రసంగంలో అబద్ధాలు తప్ప మరేమీ లేవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తరువాత ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పట్టపగలు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ తో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా ప్రకటనలు చేయించిందని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా మాఫీ చేసుకుంటూ వెళ్తోందని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకే పేర్లు మార్చి కొత్త పథకాలుగా చెప్పటం విడ్డూరంగా ఉందని అన్నారు. తొమ్మిది నెలల కాలంలో ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయకుండా, లక్షల ఇళ్లు నిర్మించామని చెప్పడం బాబు సర్కారుకే చెల్లిందని విమర్శించారు.