: కేసీఆర్ 'జాతిపిత' అయితే, కొండా లక్ష్మణ్ బాపూజీ, శ్రీకాంతాచారి ఎవరు?: రేవంత్‌ రెడ్డి నిప్పులు


చినజీయర్ స్వామి దృష్టిలో కేసీఆర్ జాతిపిత అయితే, తెలంగాణ కోసం సర్వస్వం ధారపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రాణాలు తీసుకొని ఉద్యమ స్పూర్తిని ఉవ్వెత్తుకు లేపిన శ్రీకాంతాచారి తదితరులను ఏమనాలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చినజీయర్ స్వామి తానిచ్చిన బిరుదును వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, చంద్రబాబు బడ్జెట్‌ లో జరిగిన అన్యాయంపై ప్రశ్నించారని, కూతురు పదవి కోసం తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా కేసీఆర్ మౌనంగా ఉన్నారని రేవంత్ నిప్పులు చెరిగారు.

  • Loading...

More Telugu News