: డబుల్ రోల్ లో టీడీపీ అధినేత... అధికార, విపక్ష ‘ఎమ్మెల్యే’లతో ఎన్టీఆర్ కు చంద్రబాబు నివాళి!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ఘాట్ లో దివంగత నేత ఎన్టీ రామారావుకు నివాళులర్పించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అసెంబ్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన ద్విపాత్రాభినయం చేయాల్సి వచ్చింది. ఎలాగంటే, ఏపీలో అధికార పార్టీగా గద్దెనెక్కిన టీడీపీ, తెలంగాణలో విపక్ష పాత్రకు పరిమితమైంది. ఎన్టీఆర్ కు నివాళి కార్యక్రమంలో ఇటు ఏపీ ఎమ్మెల్యే (అధికార పార్టీ)లతో పాటు తెలంగాణ ఎమ్మెల్యే (విపక్ష)లు పాల్గొన్నారు. ఏపీ అసెంబ్లీలో నేతగా (సీఎం)గా ఉన్న ఆయన తెలంగాణలో విపక్ష ఎమ్మెల్యేల పార్టీకి అధినేతగానూ జోడు పాత్రలు పోషించాల్సి వచ్చింది. ఎన్టీఆర్ కు నివాళి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించకుండా పార్టీ నేతలు జాగ్రత్తలు తీసుకోవడంతో రెండు పాత్రల్లో చంద్రబాబు ఈజీగానే సాగిపోయారు.

  • Loading...

More Telugu News