: 60 ఏళ్ల వయసులో మగబిడ్డకు జననం


మహిళల్లో 30 ఏళ్లు దాటితే పలు సమస్యల కారణంగా బిడ్డలను కనడం కాస్త కష్టమని వైద్యులు, పరిశోధనలు వెల్లడిస్తుండగా, ఆరుపదుల వయసులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్ల గ్రామం బల్డి తండాకు చెందిన లక్ష్మా, రుక్మి(60) దంపతులకు ఇంతకు ముందు 8 మంది సంతానం, వారిలో ఐదుగురు ఆడపిల్లలు మృతి చెందగా, మిగిలిన ముగ్గురిలో ఇద్దరికి వివాహాలు జరిగాయి. అయితే, మగపిల్లల్లేరన్న దిగులు లక్ష్మా, రుక్మి దంపతులను వేధిస్తుండేది. ఈ నేపథ్యంలో, రుక్మి మరోసారి గర్భందాల్చింది. దేవరకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో, ఆ కుటుంబంలో ఆనందం తాండవిస్తోంది.

  • Loading...

More Telugu News