: భార్యతో యాసిడ్ తాగించి పారిపోయాడు!


ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడంలేదు. కట్టుకున్న భార్యతో యాసిడ్ తాగించి పరారయ్యాడో భర్త. తన వివాహేతర సంబంధాలను భార్య ప్రశ్నిస్తుండడాన్ని భరించలేని భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు. నెల్లూరు జిల్లాలో జరిగిందీ ఘటన. కొడవలూరు మండలం చింతచెలిక గ్రామంలో నివసించే జనార్దన్, సుకన్య భార్యాభర్తలు. జనార్దన్ వివాహేతర సంబంధాల కారణంగా దంపతుల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో, తనను నిలదీసిందన్న ఆగ్రహంతో జనార్దన్ బలవంతంగా భార్యతో యాసిడ్ తాగించాడు. దీంతో, సుకన్య అపస్మారక స్థితిలోకి జారుకుంది. ఇది చూసిన జనార్దన్ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు సుకన్యను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News