: టీమిండియా కష్టాల్లో పడింది!


వెస్టిండీస్ తో మ్యాచ్ లో టీమిండియా కష్టాల్లో పడింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 23 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన రైనా ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు, కోహ్లీ (33) రాణించినా భారీ స్కోరు సాధించలేకపోయాడు. రహానే (14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. విండీస్ బౌలర్లు సమయోచితంగా రాణిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో ధోనీ, జడేజా ఉన్నారు. భారత జట్టు విజయానికి 27 ఓవర్లలో 76 పరుగులు చేయాలి.

  • Loading...

More Telugu News