: ప్రతిపక్షాల రాద్ధాంతమే... రైతులకు మేలు జరుగుతుంది: వెంకయ్యనాయుడు
భూసేకరణ చట్టం వల్ల రైతులకు మేలు జరుగుతుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ, ప్రజల అభ్యున్నతి కోసమే భూసేకరణ చట్టం తెస్తున్నామని అన్నారు. భూసేకరణ చట్టంపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి పక్షాల రాద్ధాంతం కారణంగా రైతుల్లో వ్యతిరేక భావాలు రేగే అవకాశం ఉందని, భూసేకరణ చట్టంపై అంతా కలిసి రావాలని ఆయన సూచించారు. భూసేకరణ చట్టం కారణంగా రైతులకు సరైన ధర కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయని ఆయన పేర్కొన్నారు.