: మార్స్ ఆర్బిటర్ ఫోటోలతో ఇస్రో రంగుల హోలీ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ ఇస్రో రంగుల పండుగ హోలీని సరికొత్తగా జరుపుకుంది. 'మంగళయాన్' మార్స్ కలర్ కెమెరా పంపిన అంగారక గ్రహం కలర్ ఫోటోలతో ఇస్రో హోలీ శుభాకాంక్షలు తెలిపింది. ఆ ఫోటోల్లో సౌర వ్యవస్థలో అతిపెద్ద అగ్నిపర్వతం, అంగారక ఉపరితలంపై లోయలు, పర్వతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014 సెప్టెంబర్ 24న మార్స్ క్షక్ష్యలో చేరుకున్న మంగళయాన్ అద్భుతమైన ఫోటోలతో ఇప్పటికే ప్రపంచ రికార్డు సాధించింది. తాజాగా, మరిన్ని రంగుల ఫోటోలను తీసి పంపడంతో ఇస్రో అధికారులు సంతోషభరితులయ్యారు.