: కోట్లు కాజేసిన లక్ష్మీవిలాస్ బ్యాంక్ మేనేజరు అరెస్ట్
రూ. 1.20 కోట్లను స్వాహా చేసిన బ్యాంకు మేనేజరును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, కడప జిల్లాలో లక్ష్మీవిలాస్ బ్యాంకు మేనేజరు రామాంజనేయరెడ్డి... బ్యాంకు సొమ్మును కాజేసి తన స్నేహితుల అకౌంట్లకు మరలించారనే ఆరోపణలు వచ్చాయి. డబ్బు స్వాహా అయినట్టు 2014 డిసెంబర్ 29న బ్యాంకు అధికారులు గుర్తించారు. అనంతరం, డిప్యూటీ మేనేజర్ రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకున్న పోలీసులు రామాంజనేయరెడ్డిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు.