: ఐజీ కుమార్తెనంటూ మోసాలకు తెరలేపింది... దొరికిపోయింది!
సులభంగా డబ్బు సంపాదించేందుకు ఓ మహిళ అడ్డదారి తొక్కింది. ఐజీ కుమార్తెనంటూ ప్రచారం చేసుకుని భర్తతో కలిసి మోసాలకు తెరలేపింది. కర్నూలు జిల్లా బనగానపల్లెలో సదరు మహిళ పోలీసులతో పరిచయం పెంచుకుంది. తాను ఐజీ కుమార్తెనని వారిని నమ్మించింది. రూ.25 వేలు కావాలంటూ వారిని కోరింది. దీంతో, పోలీసులకు అనుమానం వచ్చింది. విచారించగా, అమ్మడి గుట్టురట్టయింది. దీంతో, ఆ మోసగత్తెను, ఆమె భర్తను అరెస్టు చేశారు.